Tuesday, August 21, 2007

సమరం

" సమరం "
కవి కలం పట్టినా
చురకత్తి పట్టినా
రాలేది అక్షరాలే
అల్లేది కవితలే

కుమ్మరి మట్టి మెత్తినా
వడ్రంగి సుత్తి పట్టినా

ఎవరెన్ని చేసినా
పొట్ట కోసమేగా మరి

గాంధీజీ కాకపోయినా
నెహ్రుజిని అనుకరించకున్న
చేయి చేయి కలిపి
ప్రగతి పధాన నడువు
జై జై కొడుతూ దేశ పురోగతికి తోడ్పడు

నీవు నీవనే నిజం మరువకు
కన్న తల్లిని, కర్మ భూమిని వొదలకు
ప్రేమే శాస్వతమని మరువకు
న్యాయమును ,ధర్మమును వీడకు
నేర్చిన నీతి పాఠాలు మరువకు
చెడు,అసత్యముల జోలికి వెడలకు
చేయి చేయి కలిపి సాగిపో ముందుకు

3 comments:

ప్రవీణ్ కుమార్ said...

సంధ్య గారు,
మీ కవితలు చాలా బాగున్నాయి. తెలుగులో రాస్తే ఇంకా బాగుంటుంది. దినపత్రికలకు కూడా పంపండి

నేస్తం

sandhya said...

ప్రవీణ్ గారు
ఇప్పుడు తెలుగులోనే వుంది చదువుకోండి

Anonymous said...

andamaina nadakato alarimchina kavitaki abinamdanala akshara mala.......www.kavitaahalahalam.blogspot.com