Tuesday, August 21, 2007

సమరం

" సమరం "
కవి కలం పట్టినా
చురకత్తి పట్టినా
రాలేది అక్షరాలే
అల్లేది కవితలే

కుమ్మరి మట్టి మెత్తినా
వడ్రంగి సుత్తి పట్టినా

ఎవరెన్ని చేసినా
పొట్ట కోసమేగా మరి

గాంధీజీ కాకపోయినా
నెహ్రుజిని అనుకరించకున్న
చేయి చేయి కలిపి
ప్రగతి పధాన నడువు
జై జై కొడుతూ దేశ పురోగతికి తోడ్పడు

నీవు నీవనే నిజం మరువకు
కన్న తల్లిని, కర్మ భూమిని వొదలకు
ప్రేమే శాస్వతమని మరువకు
న్యాయమును ,ధర్మమును వీడకు
నేర్చిన నీతి పాఠాలు మరువకు
చెడు,అసత్యముల జోలికి వెడలకు
చేయి చేయి కలిపి సాగిపో ముందుకు

Tuesday, April 10, 2007

"నేస్తం"

చిగురుటాకు మీద నీటి బొట్టులా
కొలనులోని తామరాకులా
నా హృదయస్పందనలోని చిరు సవ్వడిలా
కనిపించావు నువ్వు నాకు

ఆనందంలో చిరునవ్వువయ్యావు
దుఃఖంలో కన్నీటిబోట్టువయ్యావు
గెలుపులో,ఓటమిలో తోడు నిలిచావు

నిరాశ ,నిస్పృహల దరి చేరిన నన్ను
నీ స్నేహబంధంతో సేద దీర్చావు
అలసిన మనసుకి తోడువయ్యావు
నేనున్నాను అని వెన్ను తట్టి నిలిచావు
- లక్ష్మీకి అంకితం

Sunday, April 08, 2007

" ఆడపిల్ల "

అందాల ఆడపిల్ల
ముత్యాల ముద్దుగుమ్మ

అచ్చమైన తెలుగుపిల్ల
మా ఇంటి జాబిలమ్మ

ఎదురు చూపులు దేనికమ్మ
నింగికేసి చూడకమ్మ

నీ ఎదురే వున్నది స్వర్గ సీమ
గుర్తించవేమమ్మ మా ఇంటి పైడిబొమ్మ
- సుజాతకి అంకితం

Thursday, February 08, 2007

"ప్రేమ"

ప్రేమ అన్నది ఒక వరం
కానేకాదు అది నీ పరం
దాని విలువ తెలుసుకోనంత కాలం
అవుతుంది అది నీ హస్తగతం
అయినప్పుడు నువ్వు దానికి దాసోహం

"స్నేహబంధం"

కలల తీరంలో
కాంతి కిరణంలా
తొలి సంధ్యలో
నవ ఉషస్సులా
సుప్రభాతానివో
సుమధుర భావానివో
ఓ స్నేహబంధమా
నిలిచిపో కలకాలం
నా గుండెలో పదిలంగా

"జీవన తరంగం "

జీవితమనే సంద్రంలో
కలల తీరాన అలవోకగా తేలిపోనీ
స్నేహబంధాన బంధినై సాగిపోనీ
అనుభంధాల ఖైదినై పొంగిపోనీ
బ్రతుకంతా ఇలా సాగిపోనీ
బాల్యమనే చిరుప్రాయంలో
అమ్మ ఒడిని పంచుకోనీ
కేజీల బడిని చేరుకోనీ
విద్యాబుద్ధులు నేర్చుకోనీ
హాయిహాయిగా ఆడుకోనీ
యవ్వనమనే అలజడిలో
ప్రేమ పాఠాలు వల్లించనీ
బ్రతుకు అక్షరాలు దిద్దుకోనీ
గమ్యం దిశగా పయనించనీ
ఆనుకున్న లక్ష్యం సాధించనీ

సాగే ప్రయాణం

ఓహ్ బాటసారి
ఎటొయి నీ పయనం
ఆశనిరాశల చిరునామా నీది
మితమైన శ్వాస నీది
అమితమైన మమకారం నీది
అంతులేని గమ్యం నీది

బుడి బుడి తప్పటడుగులతో మొదలు
తుది శ్వాస వరకు ఆశలు మెదలు
చిరు యవ్వన ప్రాయమున కలుగు ఆశలు
నిండు జీవితానికి దిక్సుచికలు
అలసిన మదిలో మెదలు ఆశలు
శ్రమకు ప్రతిభింభాలు

సాగనీ నీ పయనం
బంధాలని చేదిస్తూ
గెలుపుని కాంక్షిస్తూ
అలుపుని కడతేరుస్తూ