Tuesday, April 05, 2011

ప్రకృతి

కొండల్లో , కోనల్లో

పచ్చని సోయగం

వాగుల్లో, వంకల్లో

నీటి పయనం

నీలిరంగు సోగాసులీనే

ఆకాశం

మదిని పులకరింప చేసే

చల్లని పైరగాలి

ఈ నయనానందకరాలు, హృదయ స్పందనలు

చేరలేని దూరాన, చేరనివ్వని తీరాన

సాగుతోంది మన ప్రయాణం ...... సాగుతూనే వుంది .......

పని ఒత్తిడి

ఉరుకుల పరుగుల ఉద్యోగాలు

మెదడు పని పట్టే పనులు

కానరాదు గడియారం ముల్లు

కాలేదా పని నీ సంగతిక చెల్లు


చెడుగుడు ఆడే మేనేజర్లు


గుండె లోతుల్లో టెన్షన్లు


కాఫీ కప్పుకి పని చెప్పు


దాటేందుకు పెను ముప్పు


అహర్నిశలు శ్రమించు పొందేటందుకు మెప్పు


ఆపైన దక్కును నీకో కప్పు

ఉగాది

వచ్చే వచ్చే ఉగాది

ఆంధ్రుల సంవత్సరాది

ముంగిట మామిడి తోరణాలు

ముచ్చటగొలిపే రంగవల్లికలు

షడ్రుచుల పచ్చడి సేవనలు

కుటుంబ సమేతంగా విందు భోజనాలు

సంధ్యాసమయాన పంచాంగ శ్రవణాలు

మదిలో నిలిచిపోయే జ్ఞాపకాలు

Thursday, March 24, 2011

ఆశయం

ఆశయ సాధనలో ,
తప్పు ఒప్పుల లెక్కలు ఎందుకు
వడివడిగా సాగిపో ముందుకు
కృషి , పట్టుదల
గెలుపుని దరిచేరుస్తాయి
అత్యాశ, అసూయ
ఓటమి దారిపట్టిస్తాయి

నేర్పు , ఓర్పు అలవాటు చేసుకో
ప్రగతి పథాన దూసుకుపో

Monday, March 21, 2011

కాలం

ఆత్మీయతల సమాహారం,
సుమనోహరం ఈ జీవితం

కరిగిపోనీయకు కాలాన్ని ,
తిరిగిరాలేని ఈ క్షణాన్ని

గతం కావాలి తీపి జ్ఞాపకం
స్పూర్తినివ్వాలి , దారి చూపాలి
భవితవ్యాన్ని తీర్చి దిద్దాలి